ఆర్కేపురం, మే 27: విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య ఎంతో అవసరమని శివాని మహిళా డిగ్రీ కళాశాలల సెక్రటరీ వెదిరే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా శుక్రవారం కొత్తపేట శివాని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు నగరంలోని జిందా తిలిస్మాత్, ఫారూఖ్ టూత్ ఫౌడర్, పార్లే జీ బిస్కెట్ ఫ్యాక్టిరీ, మస్కతి డైరీ అండ్ ఫుడ్ ప్రాడక్ట్స్ పరిశ్రమలను సందర్శించారు. అందులో భాగంగా పరిశ్రమలలో జరుగుతున్న ఉత్పత్తి నిర్వహణ ప్యాకింగ్, మార్కెటింగ్ మొదలైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఇండస్ట్రియల్ టూర్ వలన వ్యాపార నిర్వహణ, చిన్న తరహా పరిశ్రమలను విద్యార్థులు ప్రారంభించుకోవడానికి తగు మెళకువలను తెలుసుకున్నారని తెలిపారు. ఇలాంటివి ప్రత్యక్షంగా చూడటం వల్ల విద్యార్థులకు వ్యాపారం పైన అవగాహన వస్తుందన్నారు.