సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): తాను పెండ్లి చేసుకుందామనుకున్న అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతుండటంతో చెడగొట్టేందుకు ఓ యువకుడు నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీతో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టి.. ఇబ్బందులకు గురిచేశాడు. సీపీ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. కీసర సిద్ధార్థ్‌నగర్‌కు చెందిన జతావత్ సిద్ధు సదరు అమ్మాయికి కాబోయే భర్తపై అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టడమే కాకుండా, వాటిని అమ్మాయి తరపు వాళ్ల సర్కిళ్లలో సర్యూలేట్ చేస్తున్నాడు. దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు సిద్ధును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.