ఉస్మానియా యూనివర్సిటీ, మే 27: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల పరీక్షా ఫలితాల చాలెంజ్ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ, పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ మార్కు మెమోలను మూడు వారాల తరువాత సంబంధిత కళాశాలల నుంచి పొందవచ్చన్నారు. ఈ కోర్సుల ఫలితాలపై చాలెంజ్ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఒక్కో పేపర్‌కు రూ.10,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 27వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడిగింపు
బీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షా ఫీజును ఈ నెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలి. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు చెల్లించవచ్చు. బీపీఈడీ, డీపీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 8వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలి. రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 13వ తేదీ వరకు చెల్లించవచ్చు.