వనస్థలిపురం, మే 27: చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. వారి వద్ద నుంచి రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్ కాలనీకి చెందిన మహ్మద్ ఖదీర్(23), వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. మల్లేపల్లి, మంఘడబస్తీకి చెందిన ఉప్పాడే విశాల్(19), వృత్తిరీత్యా హౌస్ కీపింగ్ పనులు చేస్తుంటాడు. వీరిద్దరూ కలిసి ఈనెల 21న గ్యార రమేశ్ అనే విద్యార్థి కోచింగ్ పూర్తైన తర్వాత ఎల్బీనగర్ బస్‌స్టాప్‌లో ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన 277డి బస్సులో ఎక్కాడు. మార్గమధ్యలో హస్తినాపురానికి రాగానే అతని ఒంటిపై ఉన్న బంగారు గొలుసును అపహరించారు. 22న బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన మహ్మద్ ఖదీర్, ఉప్పాడే విశాల్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చేసిన నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై వనస్థలిపురం, మీర్ పేట పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.