కాప్రా, మే 23 : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 202 రకాల పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.41.17 కోట్ల నిధులు మంజూరు కాగా, గత ఏడాది (2020-2021) 170 స్పిల్ ఓవర్ పనులకు సంబంధించిన రూ.57.74కోట్లతో చేపట్టిన పనులు కలుపుకొని మొత్తం రూ.98.91కోట్ల నిధులతో అభివృద్ధిపనులు చేపట్టారు. ఈ నిధులతో సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, హెచ్‌బికాలనీ, మల్లాపూర్,నాచారం తదితర ఆరు డివిజన్ల పరిధిలో 372 అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో రూ. 53.72కోట్లతో 244 అభివృద్ధిపనులు పూర్తికాగా, రూ. 15కోట్ల విలువైన 44 పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.14.05కోట్లతో చేపట్టే 37 రకాల పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది.రూ.2.82కోట్లతో చేపట్టే 13 పనులు టెండర్ దశలో ఉన్నాయి.
రూ.11.72కోట్లతో చేపట్టాల్సిన 20 అభివృద్ధి పనులకు టెండర్లను పిలువాల్సి ఉన్న ట్టు ఇంజినీరింగ్ అధికార వర్గాలు తెలిపాయి. రూ.1.57 కోట్లతో చేపట్టే 14 అభివృద్ధిపనులను వివిధ కారణాల వల్ల నిలిపివేసినట్టు పేర్కొన్నారు. అధికభాగం నిధులు స్టార్మ్‌వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, సీసీ బీటీ రోడ్ల నిర్మా ణం కోసం వెచ్చించారు. రూ.43.04 కోట్లతో 58 స్టార్మ్‌వాటర్ డ్రెయిన్లు, రూ.19.03 కోట్లతో 92 సీసీ రోడ్లు, రూ.4.93కోట్ల తో 18 బీటీ రోడ్డు పనులు చేపట్టారు. రూ.4.04కోట్లతో 22 కమ్యూనిటీహాళ్లు, రూ.7.89 కోట్లతో 18 శ్మశానవాటికల అభివృద్ధి,ఆరు డివిజన్లలో 20డీసిల్టింగ్ (నాలాల పూడికతీత) పనుల కోసం రూ.1. 99 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. ఇంకా సర్కిల్ పరిధిలో నీటి సరఫరా, ప్రహరీల నిర్మాణం, హరితహారం ప్లాంటేషన్ పనుల కోసం నిధులు వెచ్చించారు.
పనులన్నీ పూర్తి చేయిస్తాం
కాప్రాసర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో 202 రకాల పలు అభివృద్ధిపనులు చేపట్టేందుకు 2021-2022 సంవత్సరంలో రూ.41.17 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గత ఏడాది (20 20-2021)కి సంబంధించి 170 స్పిల్ ఓవర్ పనుల నిధులు రూ.57.74కోట్లతో కలుపుకొని మొత్తం రూ.98.91 కోట్ల నిధులతో పను లు చేపట్టాం. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితు లు, అవసరాల మేరకు గత ఏడాది కరోనా ఉన్నప్పటికీ అభివృద్ధిపనులు చేపట్టాం. మంజూరైన పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం.
–ఎన్.శంకర్, డిప్యూటీకమిషనర్, కాప్రాసర్కిల్