నేరేడ్మెట్,మే 22 : మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. ఆదివారం యాప్రాల్ ఎంప్లాయీస్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డితో కలిసి కాలనీలో పర్యటించారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.అనంతరం కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే హన్మంతరావు, కార్పొరేటర్ మీనా ఉపేందర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నామన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు తరుణ్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు
మల్కాజిగిరి కోర్టు బిల్డింగ్ కోసం స్థలం కేటాయిం చేలా చర్యలు తీసుకోవాలని నూతనంగా ఎన్నికైన మల్కా జిగిరి అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట రాంచం ద్రారెడ్డి ఎమ్మెల్యే హన్మంతరావును కలిసి కోరారు. ఆదివారం యాప్రాల్‌లో ఎంప్లాయీస్ కాలనీలో ఎమ్మెల్యే ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీలైనంత త్వరగా కోర్టు బిల్డింగ్ కోసం భూమిని కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జాయింట్ సెక్రటరీ ఆనంద్, మానస, కోశాధికారి నవీన్‌కుమార్ గౌడ్, బీఎన్. పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.
కల్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం
ఆడ బిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి వరంలాంటిదని ఎమ్మెల్యే హన్మంతరావు అన్నారు. ఆదివారం మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.1,00,116చొప్పన సర్కిల్లో85 కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వచ్చా క సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధికి కృషిచేస్తున్నారని అన్నారు.మహిళల స్వయం ఉపాధి కోసం మహిళా గ్రూపులకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నామన్నారు. దళితబంధులో వంద మందిలో సగానికిపైగా మహిళలకు రూ.10లక్షల ఆర్థిక సహాయం అందజేశామన్నారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్,మీడియాఇన్చార్జి నిరంజన్ పాల్గొన్నారు.