మారేడ్పల్లి, మే 22: కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మోండా డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మోండా డివిజన్లో నాలా బజార్లో రూ. 72 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాక్స్ డ్రైన్ పనులు, ఓల్డ్ జైల్ ఖానా సమీపంలోని షోలాపూర్ స్వీట్ హౌస్ వద్ద 98.50 లక్షలతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మోండా డివిజన్ ఆదయ్యనగర్లో కోట్ల రూపాయల వ్యయంతో అని వసతులతో నిర్మించిన గ్రంథాలయ భవనం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిమ్ సెంటర్ తో పాటు బస్తీ, కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, జి. నాగేందర్ ( నాగులు), ఒదెల సత్యనారాయణ, రాయి వెంకటేశ్, చిత్రలేఖ తదితరులు పాల్గొన్నారు.