దుండిగల్ మే22: మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును ఆదివారం శంబీపూర్లోని కార్యాలయంలో పలు సంఘాల నేతలు, అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గ్రీన్‌హిల్స్ కాలనీలోని శివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన ఆలయ శంకుస్థాపనకు హాజరు కావాలని కోరుతూ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు ఆదివారం కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి కృష్ణ, వైస్ చైర్మన్ పద్మారావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కాలనీ ప్రధాన కార్యదర్శి దామోదర్, కోశాధికారి సుధాకర్ తదితరులు ఉన్నారు.
శామీర్‌పేట్ మండల ఎంపీపీ ఎల్లుబాయ్ బాబు ఆదివారం శంభీపూర్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును కలిశారు. మండలంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేయగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగరాజుయాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
మేడ్చల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును కలిశారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేయగా, అందుకు ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి సంబంధిత మంత్రితో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.