కవాడిగూడ, మే 22: డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడ గగన్‌మహల్‌లోని శివ ప్యాలెస్ లైన్లో రూ. 46లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, జలమండలి డీజీఎం చంద్రశేఖర్, ఏఈ శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇక్కడ జరుగుతున్న నాలా ప్రహరీ నిర్మాణ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. ఎన్నో ఏండ్లుగా శివ ప్యాలేస్ లైన్లో సీవరేజ్ ఇబ్బందులున్నాయని, బస్తీ వాసులు తమ దృష్టికి తీసుకురావడంతో ప్రత్యేక చర్యలు తీసుకొని నిధులు మంజూరు చేయించామని అన్నారు. 200 మీటర్ల వరకు డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. బస్తీలో డ్రైనేజీ, వాటర్ వర్క్స్ నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమ తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రాంచందర్, వల్లాల శ్రీనివాస్‌యాదవ్, రాజశేఖర్‌గౌడ్, కల్వ గోపీ, సుధాకర్ యాదవ్, కరిక కిరణ్, మధుకర్, బీజేపీ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు మహేందర్‌బాబు, దిశ కమిటీ సభ్యుడు జి. వెంకటేశ్, ప్రభాకర్, పరిమళ్ కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.