సిటీబ్యూరో, మే 21 (నమస్తేతెలంగాణ): పదోతరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి (సోమవారం) నుంచి ప్రారం భం కానున్నాయి. జూన్ 1 వరకు జరిగే ఈ పరీక్షలకు హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా 74 వేల మంది విద్యార్థులు హాజరుకానుండగా, 406 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ, మాల్‌ప్రాక్టీసు వంటి ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సౌకర్యంతోపాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ‘టెన్త్ స్పెషల్’ పేరుతో బస్సులు నడుపుతున్నామని, జూన్ 1 వరకు బస్‌పాస్‌లు చెల్లుబాటు అవుతాయని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు.