సికింద్రాబాద్, మే 21: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప పథకాలు ఏ రాష్ట్రంలో లేవని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 56 మంది లబ్ధిదారులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహాలు పేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. దీంతో పేద కుటుంబాలు సంతోషంగా ఆడపిల్లల వివాహాలు చేయగలుగుతున్నారని తెలిపారు.
ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో జరిగితే ఒక్కో ప్రసవవానికి రూ.13 వేలు ఆర్థిక సహాయంతో పాటు కేసీఆర్ కిట్‌ను కూడా అందిస్తున్నారన్నారు. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి రూ. లక్షా 25 వేలు ఖర్చు చేస్తుందన్నారు. 2014కు ముందు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే పేదలు అప్పు తెచ్చేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలగిరి తహసీల్దార్ హాసీనాబేగం, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, నళినికిరణ్, లోక్‌నాథ్, శ్యామ్‌కుమార్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మాజీ డైరెక్టర్ మహంకాళి శర్విన్, నేతలు వేణుగోపాల్‌రెడ్డి, మురళీయాదవ్, తేజ్‌పాల్, సంతోష్, శ్రీను, సురేశ్, సదానంద్‌గౌడ్, శ్రీహరి, లతామహేందర్, సరిత, శంకర్, నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.