చిక్కడపల్లి, మే 20 : సుందరయ్య పార్కను అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరంలోనే బెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ రూ.42 లక్షలతో అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ రవిచారితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుందరయ్య పార్కు అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతి రోజూ వాకింగ్‌ను అలవాటుగా అలవర్చుకోవాలన్నారు.నియోజకవర్గం పరిధిలో ఉన్న పార్కుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రూ.42 లక్షల నిధులతో పార్కులో ఓపెన్ జిమ్, ఫ్లోరింగ్ , పిల్లల ఆట పరికరాలు, సుందరయ్యపార్కు ప్రధాన గేటు వద్ద ఆర్చీ తదితర వాటిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
వాకర్స్ సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ,టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.మోజస్, దామోదర్‌రెడ్డి,సీనియర్ నాయకుడు వెంకటకృష్ణ(బబ్లు)ఆర్.వివేక్, ముచ్చకుర్తి ప్రభాకర్, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, వాకర్స్‌క్లబ్ ఆఫ్ సెంట్రల్ అధ్యక్షుడు పాండయ్య, ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, కోశాధికారి రమేశ్ రెడ్డి,నాగభూషణం, పార్టీ నాయకులు కందూరి కృష్ణ, ఆర్.జయదేవ్, టెంపుల్ జనార్దన్, ముదిగొండ మురళి, ఎం.వి. జనార్దన్,కల్యాణ్ నాయక్, కొండమడుగు మధు, భగత్ గౌడ్, కూరగాయల శ్రీను, మహేశ్, దేవేందర్, సీపీఐ ముషీరాబాద్ కార్యదర్శి బి.వెంకట్‌స్వామి గౌడ్, పాల్గొన్నారు.
నైబర్‌హుడ్ కాలనీలో ప్లే గ్రౌండ్ పనులు ప్రారంభం
బాగ్లింగపంల్లిలో నైబర్‌హుడ్ కాలనీలో చిన్నారుల కోసం ప్లే గ్రౌండ్లో రూ. 6 లక్షలతో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఉన్న పార్కుల అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పార్కు అభివృద్ధికి కృషి అభినందనీయం
సుందరయ్య పార్కు అభివృద్ధి కోసం రూ. 42 లక్షలతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అభివృద్ధి పనులు ప్రారంభించడం అభినందనీయమని రూపుల వసంత్,దయానంద్, మెమోరియల్ ఫౌండేషన్ కార్యదర్శి,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.వివేక్ అన్నారు.శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్.వివేక్ మాట్లాడుతూ సుందరయ్య పార్క్ వాకర్స్ తో పాటు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.తమ ఫౌండేషన్ ద్వారా కూడా పార్కులో వాకర్స్కోసం సదుపాయాలు కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్.జయదేవ్,కొండమడుగు మధు తదితరులు పాల్గొన్నారు.