ముషీరాబాద్, మే 16: ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో వివిధ భాషలలో హాస్య పుస్తకాలు రచించి ప్రత్యేకతను చాటుకున్న డాక్టర్ తుర్లపాటి వెంకటేశ్వర్ రావుకు వండర్ బుక్ రికార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జస్టిస్ బూర్గుల మధుసూదన్, డీఎస్పీ సంజయ్ కుమార్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని వెంకటేశ్వర్ రావును ఘనంగా సత్కరించి రికార్డ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, డీవీ రాఘవరావు, ముదిగొండ ఉమా మహేశ్వర్, మధు, డాక్టర్ పీఎల్కేఎం రావు, లయన్ విజయ రాఘవ, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత చీఫ్ కో ఆర్డినేటర్ బింగి నరేందర్,తదితరులు పాల్గొన్నారు.