అంబర్‌పేట, జనవరి 16: అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గంలోని అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మొదలైన సంక్రాంతి వేడుకలు ఆదివారం కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం భోగీ, శనివారం మకర సంక్రాంతి, ఆదివారం కనుమ పండుగలను సంతోషంగా నిర్వహించారు. కరోనాతో గత ఏడాది పండుగకు దూరంగా ఉన్న ప్రజలు ఈ సంవత్సరం కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఉదయాన్నే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. కొన్ని చోట్ల ముగ్గుల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. అదే విధంగా చిన్నా పెద్ద తేడా లేకుండా పతంగులను ఎగురవేశారు. బిల్డింగ్‌లపై సౌండ్ బాక్స్‌లు పెట్టి జానపద పాటలు, నృత్యాలు చేస్తూ పతంగులను ఎగురవేశారు. విభిన్న రకాల పతంగులను ఆకాశమెత్తు ఎగురవేశారు. వివిధ పార్టీల నాయకులు తమ పార్టీ పెద్దలు, గాడ్ఫాదర్లను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీసీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు కె.మురళీకృష్ణ నేతృత్వంలో ప్రతినిధులు లింగంగౌడ్, సుదర్శన్‌రావు, బుచ్చిరెడ్డి తదితరులు ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను కలిసి పూల గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.