Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్!
Deepika | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ మరోసారి చర్చల్లో నిలిచింది. ఈ సినిమాలో తొలుత కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు పారితోషకం, లాభాల్లో వాటా వంటి అంశాలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Deepika | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ మరోసారి చర్చల్లో నిలిచింది. ఈ సినిమాలో తొలుత కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు పారితోషకం, లాభాల్లో వాటా వంటి అంశాలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ‘స్పిరిట్’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో దీపిక ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంపై కొన్ని వ్యాఖ్యలు చేసారు. లాభాల్లో వాటా కోరడం, కొన్ని షరతులు పెట్టడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో దీపికను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు చేయగా, మరోవైపు ఆమెకు మద్దతుగా కూడా పలువురు స్పందించారు.
అయితే ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోలేదనే అభిప్రాయం తాజాగా దీపిక చేసిన వ్యాఖ్యలతో కలుగుతోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీపిక పదుకొనే సినీ పరిశ్రమలో పురుషులు, మహిళల మధ్య పారితోషకాల్లో ఉన్న వ్యత్యాసంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ సినిమా విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ సినిమాలో నటిస్తున్న ఓ స్టార్ హీరోకు నిర్ణయించిన పారితోషకం గురించి తనకు తెలుసని, అయితే కెరీర్ పరంగా తాను కూడా అత్యంత విజయవంతమైన నటినేనని భావిస్తానని దీపిక పేర్కొన్నారు. ఆ హీరో కంటే ఎక్కువ సినిమాలు చేశానని, తన కెరీర్, మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుని తాను కోరుకున్న పారితోషకాన్ని కోట్ చేశానని తెలిపారు. అయితే హీరోకు భారీ పారితోషకం చెల్లిస్తున్నామని, తనకు అడిగినంత మొత్తం ఇవ్వడానికి బడ్జెట్ లేదని ఆ సినిమా టీమ్ చెప్పిందని దీపిక వెల్లడించారు. దీంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ఏ సినిమా గురించి అని ప్రశ్నించగా, ఆ ప్రాజెక్ట్ పేరును బహిరంగంగా చెప్పడానికి దీపిక నిరాకరించారు. తాను సినిమా పేర్లు బయటపెట్టి మాట్లాడే వ్యక్తిని కాదని ఆమె స్పష్టం చేశారు. అవకాశం చేజారిపోతుందనే భయంతో చాలామంది హీరోయిన్లు పారితోషకం విషయంలో రాజీ పడుతుంటారని, అందుకే మహిళలు కూడా తమ పారితోషకం విషయంలో మరింత స్పష్టతతో, ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని దీపిక అభిప్రాయపడ్డారు. దీపిక ఎక్కడా ‘స్పిరిట్’ సినిమా పేరు ప్రస్తావించనప్పటికీ, ఆమె చెప్పిన వివరాలు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించినవే కావచ్చని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ‘స్టార్ హీరోకు భారీ పారితోషకం నిర్ణయించారు.. తనకు అడిగిన మొత్తం ఇవ్వలేమని చెప్పారు.. అందుకే సినిమా నుంచి తప్పుకున్నా’ అనే ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

