Vishwambara | ‘విశ్వంభర’ రిలీజ్‌పై సస్పెన్స్.. దసరా బరి నుంచి తప్పుకున్న మెగాస్టార్ మూవీ..!
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీపై మరోసారి చర్చ మొదలైంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా తొలుత దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు భావించారు.
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీపై మరోసారి చర్చ మొదలైంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా తొలుత దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు భావించారు. అయితే తాజా పరిణామాల ప్రకారం ‘విశ్వంభర’ దసరా రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ ప్రస్తుతం డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే డిసెంబర్ నెలలో ఇప్పటికే పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’, బాలకృష్ణ నటిస్తున్న NBK111, షారుఖ్ ఖాన్ చిత్రం ‘కింగ్’, అలాగే హాలీవుడ్ భారీ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ వంటి క్రేజీ ప్రాజెక్టులు బరిలో ఉండటంతో ‘విశ్వంభర’కు సరైన విడుదల తేదీని ఖరారు చేయడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘కాకా’ జనవరి 13న విడుదల కానుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ‘విశ్వంభర’ డిసెంబర్లో విడుదలైతే, కేవలం నెల రోజుల వ్యవధిలోనే చిరంజీవి నుంచి రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకే హీరోకు చెందిన రెండు భారీ చిత్రాలు ఇంత తక్కువ గ్యాప్‌లో విడుదల కావడం బాక్సాఫీస్ పరంగా ఎంతవరకు సరైన నిర్ణయం అవుతుందనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ను 2027 సమ్మర్‌కు వాయిదా వేయడం మంచిదని అభిమానుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. సరైన గ్యాప్‌తో విడుదల చేస్తే సినిమాకు మరింత భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.
‘విశ్వంభర’ సినిమాకు అత్యంత కీలకమైన అంశం విజువల్ ఎఫెక్ట్స్. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నందున, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తిస్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఈ పనుల్లో ఇంకా కొంత భాగం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కేవలం రిలీజ్ డేట్‌ను టార్గెట్ చేయకుండా, ముందుగా పూర్తి ఔట్‌పుట్‌ను చూసిన తర్వాతే మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. వీఎఫ్ఎక్స్ నాణ్యతపై చిరంజీవి పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జనవరిలో ‘కాకా’ విడుదలైతే, మెగాస్టార్ నుంచి వరుసగా రెండు భారీ చిత్రాలు వచ్చే అవకాశం కూడా ఉండటంతో అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

