కీసర, మే 9: మల్కాజిగిరి ఎంపీగా పనిచేస్తు న్న రేవంత్రెడ్డి గెలిచి మూడేండ్లు అయినా అటు పార్లమెంట్లో కాని, ఇటు తెలంగాణలో కాని అభివృద్ధి కోసం గొంతు విప్పిన దాఖలాలు లేవ ని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన రీతిలో గుణపా ఠం చెబుతారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలు ఊడ్చుకుపోయాయని, అన్ని పార్టీ ల నేతలు టీఆర్ఎస్ గూటికే చేరుతున్నారని మం త్రి అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల కేం ద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పంచాయతి స భ్యులు తటాకం లక్ష్మణ్ శర్మ, బండారి శంకర్ గౌడ్, రామారం ప్రదీప్ కుమార్, జూపల్లి లక్ష్మీలతో పాటు వారి అనుచర వర్గమైన 50 మంది సోమవారం రాష్ట్ర మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులను మంత్రి ఆహ్వానించి టీఆర్ఎస్ పార్టీ కండువా గప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీతో రేవంత్రెడ్డి పోరాటం చేస్తున్నారని, ఆయ న ఎన్ని పోరాటాలు చేసిన తెలంగాణలో నడువవని, ఆయన ఓటుకు నోటు కేసులో పెద్ద దొంగ ని, ఆ దొంగలకు తెలంగాణలో స్థానం లేదన్నా రు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, రేవంత్రెడ్డి ఎన్ని మాట్లాడిన ప్రజలు మెచ్చే స్థితిలో లేరన్నారు. రైతాంగానికి దగా చేసి పండించిన పంటలను కొనకుండా మోసం చేస్తున్న బీజీపీకి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఘట్కేసర్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, కీసర మాజీ ఎంపీపీ సుజాత, సర్పంచ్ మాధురి వెంకటేశ్, ఎంపీటీసీ తటాకం నారాయణ శర్మ పాల్గొన్నారు.