
కుత్బుల్లాపూర్, జనవరి 11 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధే తన ధ్యేయమని.. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని స్థానిక ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలో పలు కాలనీలు, స్వచ్ఛంద సంఘాలు, ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి.. సమస్య లను విన్నవించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చింతల్ డివిజన్, వివేకానంద్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు, జీడిమెట్ల డివిజన్, వినాయక్‌నగర్ వాసులు, రంగారెడ్డినగర్ డివిజన్, గాంధీనగర్‌లో రామలింగేశ్వరస్వామి, ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు వేర్వేరుగా ఎమ్మెల్యేను కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కుత్బుల్లాపూర్ మండల స్వర్ణకార సంఘానికి సంబంధించిన నూతన సంవత్సర క్యా లెండర్‌ను, ఎంఎన్‌రెడ్డి నగర్ కాలనీలో ఎస్ఎల్ఎన్ వెంచర్ నిర్వాహకులు రాకేశ్, కిరణ్మయిల ఆధ్వర్యంలో తీసిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈస్ట్ కోస్ట్ మాగ్నెట్స్ కార్మికులకు న్యాయం..
షాపూర్‌నగర్‌లోని ఈస్ట్ కోస్ట్ మాగ్నెట్ కంపెనీలో పని చేస్తున్న 49 మంది కార్మికులకు ఎమ్మెల్యే వివేకానంద్ కంపెనీ యాజమాన్యంతో చర్చించి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.6, 200 వేతన ఒప్పందాన్ని కుదుర్చా రు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.