సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా ఓ రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. హైదరాబాద్ మహా నగరానికి మం చినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ ఫేజ్-1కి సంబంధించి మీరాలం ఆలియాబాద్ ఆఫ్ టేక్ వద్ద 1200 ఎంఎం డ యా ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌కు జంక్షన్ పనులు జరపాల్సి ఉంది.
ఎస్ఆర్డీపీలో భాగంగా జరుగుతున్న ఫె్లైఓవర్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా ఈ పనులు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం ఆరు గంటల వర కు 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఫేజ్-1 కిందున్న రిజర్వాయర్ల పరిధి లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నదన్నారు.
మీరాలం, కిషన్ బాగ్, అల్ జుబైల్ కాలనీ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, సంతోష్ నగర్, వినయ్ నగర్ , సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్ గఢ్, యాకుత్‌పురా, మాదన్న పేట, మహబూబ్ మేన్షన్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, రియాసత్ నగర్, ఆలియాబాద్, బాలాపూర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, బొగ్గుల కుంట, అప్జల్‌గంజ్, నారాయణ గూడ, అడిక్‌మెట్, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్సుఖ్ నగర్, బొంగుళూరు, మన్నెగూడ రిజర్వాయర్ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని అధికారులకు సహకరించాలని కోరారు.
కృష్ణ ఫేజ్-2, 3కి సంబంధించి గొడకొండ్ల 132 కేవీ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ను టీఎస్ ట్రాన్స్‌కో మార్చనుంది. ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మూడు గంటల పాటు ఫేజ్-2, 3లో రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతున్నదని పేర్కొన్నారు.
మైసారం, బారాస్ శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగు ట్ట, చింతల్ బస్తీ, షేక్ పేట్, అలబండ, మేకల మండి, భోలక్‌పూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, తార్నాక, లాలాపేట, బౌద్ధ నగర్, మారేడ్ప ల్లి, రైల్వేస్ కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్ గూ డ, గౌతమ్ నగర్, సాహెబ్‌నగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్, మహేం ద్ర హిల్స్, సైనిక్ పురి, మౌలాలి, వెలుగుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీర ప్ప గడ్డ, స్నేహపురి, కైలాస్గిరి, దేవేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరిహిల్స్, మధుబ న్, దుర్గానగర్, బుద్వేల్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, నైన్ నెం:, గంధంగూడ, బోడుప్పల్, మల్లికార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచర్ల, భరత్ నగర్, ఫీర్జాదిగూడ, మీర్‌పేట, లెనిన్ నగర్, బడంగ్ పేట, ధర్మ సాయి, మన్నెగూ డ, తుర యంజాల్లలో అంతరాయం కలగనుంది.