తెలంగాణలోని ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువని, వారి కష్టసుఖాలను గురించి ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో శుక్రవారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ‘సీఎం కేసీఆర్‌తో రక్షాబంధన్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు.
కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులతో కలిసి టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు,నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు సీఎం కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపకల్పన చేయడంతో పాటు సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు యెండూరి మాధవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని మహిళల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని హిమాయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ జె.హేమ లత యాదవ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి తెలిపారు.
నారాయణగూడలోని మేల్కోటే పార్కులో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు.ఈ కార్యక్రమంలో పార్కు అధ్యక్షుడు భూషణ్‌రావు, టీఆర్ఎస్ నాయకులు జె.బాబుయాదవ్, డి.రాజేందర్‌కుమార్, పి.ప్రభాకర్‌గౌడ్, ఎన్.రాజేంద్ర ప్రసాద్, ఆర్.అశోక్‌కుమార్,మజీద్,సర్ఫరాజ్, క్రిష్ణయాదవ్,కొల్కుల శ్రీకాంత్, ఐలమ్మ,రామకృష్ణ పాల్గొన్నారు.