జీడిమెట్ల, ఆగస్టు 6 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంతో లబ్ధిపొందిన దళిత కుటుంబాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. నాడు ప్రైవేటు కంపెనీలో కార్మికులుగా పని చేసినవారు.. నేడు దళిత బంధు పథకం ద్వారా షాపులకు యజమానులయ్యారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఎంద రో తలరాతలను మార్చుతున్నది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ద్వారా 100 మంది అర్హులను గుర్తించారు. ఇప్పటి వరకు 83 మంది లబ్ధిదారులకు చెందిన యూనిట్లు గ్రౌండింగ్ పూర్తయ్యాయి. మరో 17 మందికి నిధులు కేటాయించాలని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇందులో అశోక్ లై లాండ్ లారీలు- 19, బొలెరో జీపులు- 15, ట్రాన్స్‌పోర్టు కార్లు -17, ట్రాక్టర్లు-18, మిని డైరీ ఫామ్స్-7, టాటా ఎస్ వాహనాలు- 3, జేసీబీ- 1, ఆటో-1, సెంట్రింగ్ సామ గ్రి యూనిట్- 2 గ్రౌండింగ్ పూర్తయ్యాయి. ఇందులో సుమారు 30 యూనిట్లు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం రూ.9,24, 40,000 నిధులు మంజూరయ్యాయి.
నేను గతంలో ఫ్య్రాబ్రికేషన్ పని చేసేవాన్ని. సీఎం కేసీఆర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సహకారంతో దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షలు మం జూరయ్యాయి. శ్రీనివాస్‌నగర్ కాలనీలో నందహరి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ , ఫ్లోర్ మిల్‌ను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నా..ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
– డి.కుమార స్వామి, శ్రీనివాస్‌నగర్ కాలనీ
నేను గతంలో కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో వెల్డర్‌గా పనిచేశాను. దళిత బంధు పథకం ద్వారా రూ.9.90 లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బులతో శ్రీనివాస్‌నగర్ కాలనీలో తేజస్విని ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపును ప్రారంభించాను. దీనివల్ల ఉపాధి పొందుతూ.. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను.
– డి.శ్రీనివాస్, శ్రీనివాస్‌నగర్ కాలనీ