కొండాపూర్, జూలై 29 : నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్‌నగర్‌లో రూ. 27 లక్షల వ్యయంతో చేపట్టిన మంజీరా తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి బాటలో కాలనీలు, బస్తీలు ముందుకు సాగుతున్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథలో భాగంగా 18 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తవ్వగా, ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు పైపులైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ నీలం రవిందర్ ముదిరాజ్, నాయకులు కృష్ణగౌడ్, ఊట్ల క్రిష్ణ, బలరాం యాదవ్, నరసింహ సాగర్, జంగంగౌడ్, బసవరాజ్, తిరుపతిరెడ్డి, గణపతి, తిరుపతి, రవి శంకర్ నాయక్, చారి, వెంకట్, సరోజరెడ్డి, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్, జూలై 29: శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయహిల్స్ కాలనీలో రూ.13.50 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్‌తో పాటు జలమండలి అధికారులతో కలిసి యూజీడీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్, డీజీఎం శ్రీమన్నారయణ, మేనేజర్ నివర్తి, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చిన్న మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సహదేవ్, గోపాల్ నాయక్, వజీర్లతో పాటు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మాదాపూర్, జూలై 29: దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళతబంధు కార్యక్రమంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారుడు నాగరాజ్‌కు శుక్రవారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో సెంట్రింగ్, ఐరన్ స్కప్ఫాల్డింగ్ మెటీరియల్‌ను మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్‌పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, సయ్యద్ గౌస్, శేఖర్‌గౌడ్, రఘునాథ్, విమల కుమార్, సీతారాం, శోభన్, యాదగిరిలతో పాలు పలువురు మహిళలు పాల్గొన్నారు.
మియాపూర్, జూలై 29 : వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగు కృషి చేస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రజల అవసరాలు తీరుస్తూ కుటుంబ పోషణను కొనసాగించుకుంటున్న చిరు వ్యాపారులు తమ పనిలో చక్కని పురోభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చందానగర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ కల్యాణ మండపంలో పట్టణ ప్రగతి – స్ట్రీట్ వెండర్స్ అభివృద్ధి స్వానిధి మహోత్సవ కార్యక్రమంలో ఆర్సీపూర్ డీసీ బాలయ్య, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్‌రెడ్డి, జగదీశ్వర్ గౌడ్లతో కలిసి విప్ గాంధీ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్తించిన 40 మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున ఆయా బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనెరా, ఏపీజీవీబీ, అపెక్స్ నుంచి రుణ సదుపాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవన్‌జ్యోతి మహంతి, రాష్ట్ర కోఆర్టినేటర్ డాక్టర్ కృష్ణ చైతన్య, పీవోలు ఉషారాణి, పుణ్యవతి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, వెంకటేశ్, నరేందర్, హరీశ్, కార్తీక్, అమీత్, రాజశేఖర్ పాల్గొన్నారు.
మియాపూర్, జూలై 29 : ఏండ్ల తరబడి డ్రైవర్లుగా పని చేస్తున్న వారెందరో దళిత బంధు పథకం ద్వారా యజమానులుగా మారుతున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అర్హులైన పేద దళితులందరి జీవితంలో ఇలాంటి మార్పును తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్‌కు చెందిన భుజంగంకు దళితబంధు పథకం కింద మంజూరైన కారును విప్ గాంధీ శుక్రవారం తన నివాసంలో లబ్ధిదారుకు అందించారు. ఈ కార్యక్రమంలో కాశీనాథ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొండాపూర్: చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాశ్ నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల పూజ కార్యక్రమానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, పూజలో డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, ఎల్లమయ్య, వెంకటేశ్, శ్రీకాంత్, ఓ వెంకటేశ్, నరేందర్ బల్ల, హరీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, జూలై 29: లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ సమీపంలోని దర్గా ఉర్సు ఉత్సవాలు ముస్లీం సోదరులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భగా దర్గాలో చద్దర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, మిరియాల రాఘవరావు, వీరేశం, హబీబ్ బాయ్, గపూర్ తదితరులు పాల్గొన్నారు.