Private Schools | ఇకపై ప్రైవేట్ స్కూళ్లలో యూనిఫామ్, బూట్లు, బెల్ట్ అమ్మడం నిషేధం
ప్రైవేటు స్కూళ్లలో (Private Schools) యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో (Private Schools) యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ డీఈవో (Hyderabad DEO) ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల (రాష్ట్ర, సీబీఎస్సీ, ఐసీఎస్సీ) ప్రాంగణాల్లో యూనిఫారాలు, షూస్, బెల్ట్ అమ్మడానికి వీల్లేదని పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే.. అవి వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటి క్రయ విక్రయాలు జరుగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

