దారిదోపిడీ కేసు.. ఇద్దరు పోలీసుల అరెస్ట్
రోడ్డుమీద నిలబడి డబ్బులు లెక్కబెట్టుకుంటున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తామంటూ బెదిరించి రూ.50వేలు లాక్కున్న ఫిలింనగర్ కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
- 14 రోజుల రిమాండ్..కానిస్టేబుల్‌పై పలు ఆరోపణలు
- కేసు నుంచి తప్పించుకునేందుకు పైరవీలు
బంజారాహిల్స్, నవంబర్ 9: రోడ్డుమీద నిలబడి డబ్బులు లెక్కబెట్టుకుంటున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తామంటూ బెదిరించి రూ.50వేలు లాక్కున్న ఫిలింనగర్ కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విజయనగరం జిల్లాకు చెందిన గుంటాటి సత్యనారాయణ అనే వ్యక్తి నార్సింగిలోని శివసాయి నగర్లో నివాసం ఉంటాడు. అతడికి బ్యాంక్ లోన్ ఉండడంతో దాన్ని చెల్లించేందుకు గోపన్‌పల్లికి చెందిన స్నేహితుడు సాగర్‌ను రూ.3 లక్షలు అప్పు అడిగాడు. ఈనెల 4న సాయంత్రం 6.45 ప్రాంతంలో సాగర్ డబ్బు తీసుకుని షేక్‌పేట నాలా సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ వద్దకు వచ్చాడు.
సాగర్ తనవద్దనున్న రూ.3లక్షలను సత్యనారాయణకు అప్పగించి వెళ్లిపోయాడు. రోడ్డుపక్కన నిలబడి డబ్బును లెక్కపెట్టుకున్న సత్యనారాయణ దాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని ముందుకు వెళ్లేందుకు యత్నిస్తుండగా, అక్కడకు వచ్చిన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ ఎస్.మల్సూర్ అలియాస్ మధుబాబు(34), హోంగార్డు వి.మోహన్‌గౌడ్(39) దగ్గరకు వచ్చి బ్యాగులో ఏముందంటూ ప్రశ్నించారు.
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన సత్యనారాయణ తన బ్యాగ్‌లో స్వీట్‌బాక్స్ ఉందని తప్పించుకునేందుకు యత్నించగా, బ్యాగ్‌లో డబ్బుందని, నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటూ బెదిరింపులకు గురిచేశారు. తనను అరెస్ట్చేయవద్దంటూ సత్యనారాయణ ప్రాధేయపడగా రూ.70వేలు ఇస్తే వదిలిపెడ్తామని మల్సూర్ బేరానికి దిగాడు. తనకు అర్జెంట్‌గా డబ్బులు అవసరమని రూ.70వేలు ఇచ్చుకోలేనని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ మల్సూర్ బలవంతంగా సత్యనారాయణ బ్యాగులో ఉన్న రూ.50వేల నగదును లాక్కున్నాడు.
దోచుకున్న నగదులో సుమారు రూ. 20వేలు హోంగార్డుకు ఇచ్చిన మల్సూర్ రూ.30వేలను తీసుకుని వెళ్లిపోయాడు.ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ మల్సూర్, హోంగార్డు మోహన్‌గౌడ్ మీద బీఎన్ఎస్ 309(4), 126(2), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.
గతంలోనూ పలు ఆరోపణలు..
ఇదిలా ఉండగా రాబరీ కేసులో అరెస్టయిన ఫిలింనగర్ కానిస్టేబుల్ మల్సూర్‌పై గతంలో సైతం పలు ఆరోపణలున్నాయని విచారణలో తేలింది. తనపై కేసు నమోదైన విషయాన్ని గుర్తించిన కానిస్టేబుల్ మల్సూర్ డ్యూటీకి రాకుండా పారిపోవడమే కాకుండా కేసు నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే మల్సూర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులు అధికారులు సూచించడంతో తన ప్రయత్నాలు మానుకున్నాడని విశ్వసనీయ సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

