సైబర్ నేరగాళ్లకు పోలీసుల షాక్
సాంకేతికతను అడ్డంపెట్టుకుని అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. ప్రత్యేక ఆపరేషన్లలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 13 ప్రధాన కేసుల్లో 20 మంది నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు.
- మార్చి నెలలో రూ.1.59కోట్ల రికవరీ
- 13 ప్రధాన కేసుల్లో 20 మంది అరెస్ట్
సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): సాంకేతికతను అడ్డంపెట్టుకుని అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. ప్రత్యేక ఆపరేషన్లలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 13 ప్రధాన కేసుల్లో 20 మంది నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. సిటీ అడిషనల్ పోలీసు కమిషనర్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం మార్చి నెలలో బాధితులకు సుమారు రూ.1,59,69,564 మొత్తాన్ని రీఫండ్ చేయించామని చెప్పారు.
హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఈ అంతర్ రాష్ట్ర ఆపరేషన్లో తెలంగాణ నుంచి 15 మంది, కేరళ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, గోవా, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6.5లక్షల నగదు, 14మొబైల్ ఫోన్స్, 4ల్యాప్టాప్లు, చెక్బుక్కులు, షెల్ కంపెనీలకు చెందిన స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ప్రధానంగా పెట్టుబడులు, గేమింగ్, మ్యాట్రిమొనీ, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మార్చి నెలలో నమోదైన కేసుల్లో ఒక గేమింగ్ మోసం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ఇన్స్టాగ్రామ్లో ప్రకటనతో ఆకర్షితురాలైన బాధితురాలు అధిక లాభాల ఆశతో ఏకంగా రూ.26.07కోట్లు నష్టపోయింది. ఈ కేసులో హైదరాబాద్, మేడ్చల్, కేరళ, గోవాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మార్చిలో బాధితులు రూ.4.40కోట్లు కోల్పోగా బ్యాంకింగ్ రంగంతో సమన్వయం చేసుకుని రూ.1.59కోట్లకు పైగా మొత్తాన్ని వెనక్కు రప్పించారు. డెబిట్ కార్డ్ ఫ్రాడ్, కస్టమర్కేర్ ఫ్రాడ్ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న మొత్తాన్ని 100శాతం తిరిగి ఇప్పించామని అడిషనల్ సీపీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

