సిటీబస్సు.. రోజుకు 2 కోట్లు

- ప్రతిరోజూ ఆర్టీసీ సగటు ఆదాయం..
- 50నుంచి 60 శాతం నిండుతున్నాయి
సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో తిరుగుతున్న సిటీ బస్సులతో ప్రతిరోజూ దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. లాక్డౌన్ విధించిన సమయంలో సిటీ బస్సుల ఆదాయం కేవలం రూ.15 లక్షలు మాత్రమే వచ్చింది. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తి వేసిన నాటి నుంచి క్రమంగా సిటీ బస్సుల ఆదాయం పెరుగుతూ వచ్చింది. నెలలో ప్రతి రోజూ సగటున రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు పేర్కొన్నారు. ప్రతి రోజూ 2,500 వరకు సిటీ బస్సులు మహానగర రోడ్లపై తిరుగుతున్నాయనీ, 50 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి గత నెల రోజులుగా స్థిరంగా ఉంటుందని తెలిపారు. విద్యా సంస్థలు పూర్తిగా తెరిస్తే అక్యుపెన్సీ 70 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యా సంస్థలు పనిచేయడంతో జనరల్ పాసులు, స్టూడెంట్ పాసుల సంఖ్య కూడా పెరుగుతుందని, దాని వల్ల ఆర్టీసీకి మరింత ఆదాయం వస్తుందన్నారు.
పండుగ సీజన్లో పెరుగనున్న ప్రయాణికులు..
వచ్చేది పండుగల సీజన్. ప్రస్తుతం బక్రీద్ ఉంది. వెంటనే రాఖీ పండుగ వస్తుంది. ఆ తర్వాత వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు వస్తున్నాయి. దీంతో గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరుగనున్నది. ఈ క్రమంలో సిటీ బస్సుల్లో కూడా అక్యుపెన్సీ పెరగడానికి, ఆదాయం రావడానికి అవకాశం ఉన్నదని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సిటీ బస్సులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- hyderabad city bus
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

