రియల్ రివర్స్.. ఆస్తులు ఫుల్ అమ్మకాలు నిల్
దేశంలోని అత్యధిక ఇన్వెంటరీ కలిగిన నగరాల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్.. గతంలో ఇన్వెంటరీ కంటే డిమాండ్ అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో ముందు వరుసలో ఉండేది. కానీ కాంగ్రెస్ చేపట్టిన విధ్వంసకరమైన పాలన విధానాలు రియాల్టీకి స్వర్గధామమైన హైదరాబాద్‌ను చతికిల పడేశాయి.
- గుదిబండలా ‘ఇన్వెంటరీ’
- అమ్ముడుపోని ఆస్తులతో ఇక్కట్లు
- భారీగా పెరుగుతున్న రియల్ ఇన్వెంటరీ
- సరిపడా రెసిడెన్షియల్, కమర్షియల్ నిల్వలు
- అత్యధిక ఇన్వెంటరీ కలిగిన నగరాలో హైదరాబాద్ ఒకటి ఐసీఆర్ఏ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి అమ్ముడుపోని ఆస్తులు(ఇన్వెంటరీ) గుదిబండలా మారుతున్నాయి. నిర్మాణాలు పూర్తి చేసుకుని, కొనుగోలుదారుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రియాల్టీ సంస్థలు.. వాటిని అమ్ముకోలేక పడావు పెడుతున్నారు. దీంతో అత్యంత శరవేగంగా పెరిగిన ఇన్వెంటరీ వచ్చే రెండేళ్ల వరకు కొత్తగా కట్టకుండా, ఉన్నవాటిని అమ్ముకుంటూ పోయిన కూడా తరిగిపోని స్థాయిలో పెరిగింది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)
దేశంలోని అత్యధిక ఇన్వెంటరీ కలిగిన నగరాల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్.. గతంలో ఇన్వెంటరీ కంటే డిమాండ్ అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో ముందు వరుసలో ఉండేది. కానీ కాంగ్రెస్ చేపట్టిన విధ్వంసకరమైన పాలన విధానాలు రియాల్టీకి స్వర్గధామమైన హైదరాబాద్‌ను చతికిల పడేశాయి. ఇప్పుడు నగరంలో పెరిగిన ఇన్వెంటరీ అత్యంత ఆందోళన కలిగి ఉండగా.. దేశంలో ఉన్న మొత్తం ఇన్వెంటరీలో 30 శాతానికి పైగా హైదరాబాద్‌లో నిల్వ ఉందని ఐసీఆర్ఏ సంస్థ వెల్లడించిన నివేదికలో తేలింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఎకడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది.
అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు (ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్) గణాంకాలు ఏం చెబుతున్నాయి? కొన్నేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సూపర్ స్పీడ్ తో దూసుకెళ్లింది. కానీ తాజా నివేదికల ప్రకారం, దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అత్యధికంగా అమ్ముడుపోని రెసిడెన్షియల్ కమర్షియల్ నిల్వలు పేరుకుపోయాయి. 2026 జూన్ నాటికి నగరంలో అమ్ముడుపోని నివాస స్థలం 296 మిలియన్ చదరపు అడుగులకు (29.6 కోట్లు) చేరింది. ఇది దేశంలోని టాప్-7 నగరాల మొత్తం నిల్వల్లో దాదాపు 30 శాతం కావడం విశేషం. ప్రస్తుత అమ్మకాల వేగంతో ఈ ఇళ్లన్నీ అమ్ముడుపోవడానికి సుమారు 2.4 ఏళ్లు (29 నెలలు) పడుతుందనే అంచనాలు ఉన్నాయి. 2024 మార్చిలో ఇది కేవలం 1.6 ఏళ్లుగా మాత్రమే ఉండేది.
ఇన్వెంటరీపై భిన్నాభిప్రాయాలు…
మరోవైపు, ఈ పరిస్థితిపై రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని ‘డెడ్ స్టాక్’అనలేమని వ్యాఖ్యానిస్తున్నారు. మారెట్లో ఉన్న డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా ఉందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ అమ్ముడుపోకుండా నిల్వ ఉన్న ఇన్వెంటరీని చూసి రియాల్టీ సంస్థలే బెంబేలేత్తిపోతున్నాయి. ఈ ఇన్వెంటరీలో ఎకువ భాగం భవిష్యత్ పైప్‌లైన్(ఫ్యూచర్ ప్రాజెక్టులు)కు చెందినదేనని అభిప్రాయపడుతున్నారు. నిల్వలు పెరగడం, కొత్త ప్రాజెక్ట్‌లు వస్తుండటంతో ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొనుగోలుకు మంచి తరుణమే అయినా.. బిల్డర్లు కస్టమర్లను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లు, సులభమైన చెల్లింపు ప్లాన్లు ప్రకటించే అవకాశం ఉంది.
వీటిని నమ్మి బిల్డర్ల చేతికి చిక్కితే భవిష్యత్‌లో కలిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ నిపుణులు కొనుగోలుదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. మారెట్లో ఆఫర్లు వస్తున్నాయి కదా అని తొందరపడకుండా.. ఆ ప్రాజెక్టుకు రేరారిజిస్ట్రేషన్ ఉందా? ఇచ్చిన గడువులోగా డెలివరీ ఇస్తారా? ఆ బిల్డర్ మునుపటి రికార్డు ఎలా ఉంది? అప్పుల భారం ఎలా ఉంది? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయడం మంచిదని సూచిస్తునారు. భారీగా పెరిగిన ఇన్వెంటరీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఒక కొత్త సంక్షోభం వైపు నెడుతుండగా… పెరుగుతున్న నిల్వలు ఏ మేరకు ప్రభావం చూపుతుందనే ఆందోళన కలిగిస్తున్నది.
లగ్జరీ హడావుడి.. కొనుగోళ్ల మందకొడి
ఈ నిల్వల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటంటే.. డెవలపర్లంతా సా మాన్యుల ఇళ్ల కంటే లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణానికే ఎకువ ప్రాధాన్యత ఇస్తుండటమేనని వాదిస్తున్నారు. ఈ అమ్ముడుపోని నిల్వల్లో ఏకంగా 45- 50 శాతం లగ్జరీ విభాగాలవే కావడం గమనార్హం. అంతేకాకుండా అమెరికా వంటి దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐ పెట్టుబడులు తగ్గడం కూడా కొంత ప్రభావం చూపింది. ఇటీవల క్రెడాయ్-సీఆర్ఈ మ్యాట్రిక్స్ వెల్లడించిన నివేదికలోనూ..నగరంలో ఉన్న ఇళ్ల లో దాదాపు సగం కూడా అమ్ముడుపోని ఇళ్ల ధరనే రూ.1.5 కోట్ల పైనే ఉంటుందనే అంచనా. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌లో మందకొడిగా సాగుతూ నే ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2027లో కొత్త ప్రాజెక్టు ప్రారంభోత్సవాలు 30-33శాతం వరకు పెరుగుతాయని ఐసీఆర్ఏ అంచనా వేస్తుండగా, భారీగా పెరిగిన ఇన్వె ంటరీ సిటీ రియాల్టీకి అదనపు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని సౌత్ వెస్ట్ ప్రాంతంలో ఈ దూకుడు ఎకువగా ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

