హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఇకబెనా ఆర్ట్‌లో ప్రావీణ్యం ప్రదర్శించిన హైదరాబాద్‌కు చెందిన జీ రేఖారెడ్డిని జపాన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించినట్టు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. పువ్వులు, ఆకులు, కొమ్మలను ఒక పద్ధతి ప్రకారం అమర్చితే వచ్చే అందమైన రూపాన్ని ఇకబెనా అంటారు. ఇది జపాన్‌కు చెందిన అతి పురాతన కళ. ఇకబెనా ఆర్ట్‌లో రేఖారెడ్డి దిట్ట. ఆమె రెండున్నర దశాబ్దాలుగా ఇకబెనాలో శిక్షణ ఇస్తున్నారు.
అనేక వర్షాప్లు, ప్రదర్శనలు నిర్వహించారు. జపాన్, భారత్ మధ్య స్నేహబంధం ఆవశ్యకతను ఇకబెనా ప్రతిభతో ఆమె ఆవిష్కరించారు. ఒహారా చాప్టర్ అండ్ ఇకబెనా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్స్ #250కి ఆమె అధ్యక్షురాలిగా సేవలందించారు. ఫికీ లేడీస్ ఆర్గనైజేషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 75 మంది ఇతర ఇకబెనా ఔత్సాహికులతో కలిసి ఆమె జపాన్-ఇండియా దౌత్య సంబంధాల జ్ఞాపకార్థం ‘మిశ్రానా-ఇకబెనా ఆఫ్ జపాన్ మీట్స్ రెసిపీస్ ఆఫ్ ఇండియా’అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు.