ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 8 : మండల పరిధిలోని కొర్రెములలో సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డితో కలిసి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతతతో పాటు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు.
పంచాయతీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు అమ్మవారి ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ తెలిపారు. వచ్చే సంవత్సరంలోగా అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బోడుప్పల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్ కవిత పాల్గొన్నారు.
కార్యక్రమంలో కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ వినోద, పంచాయతీ సభ్యులు ఆంజనేయులు, దుర్గారాజు గౌడ్, భార్గవి, సునీత, భాస్కర్, బాబు, స్వామి, లక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్ గౌడ్, నాయకులు కృష్ణ, బాలరాజు, నాగార్జున, సురేందర్ రెడ్డి, రవి కుమార్, సత్యనారాయణ, యాదగిరి, మన్యం, నాగేశ్ గౌడ్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 8 : ప్రభుత్వ ఆర్థిక, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందజేసి పార్టీ ప్రతిష్టను పెంచాలని మల్లారెడ్డి హెల్త్‌సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి తెలిపారు. ఎదులాబాద్‌లో సోమవారం నిర్వహించిన గ్రామ శాఖ కార్యకర్తల సమావేశంలో భద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ సురేశ్, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.