HYD Rain | హైదరాబాద్ పరిధిలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, సరూర్‌నగర్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అలాగే, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్, ముషీరాబాద్, రాంనగర్, గాంధీనగర్, కవాడీగూడ, చిక్కడపల్లి, అడిక్‌మెట్, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీకి క్రాస్‌రోడ్, దోమలగూడ మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, ఆసిఫ్‌నగర్, అత్తాపూర్‌లో వర్షాపాతం నమోదైంది. గుడిమల్కాపూర్‌లో భారీ వర్షం కురవడంతో రహదారులను వర్షం నీరు ముంచెత్తింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై వాహనాలు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.