చంపాపేట, ఏప్రిల్ 29: హైదరాబాద్ చంపాపేట డివిజన్ పరిధి కర్మన్‌ఘాట్‌లోని శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని మంగళవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబసమేతంగా సందర్శించారు. ఉదయం ఆలయానికి వెళ్లిన ఆయనకు.. ఆలయ నిర్వహణ బాధ్యుల సమక్షంలో వారిని మంగళ వాయిద్యాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి దంపతులకు ఆలయ వేద పండితులు, అర్చక బృందం ప్రత్యేక అర్చనలు నిర్వహించి ఆశీర్వచనాలు ఇచ్చారు. అలాగే శాలువాలతో సత్కరించి, స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్వహణ బాధ్యులతో మాట్లాడి.. ఆలయ ప్రతిష్ట గురించి అడిగి తెలుసుకున్నారు.