దారుణం.. భార్యను ఇటుకతో కొట్టి హత్య చేసిన భర్త
భార్యను సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ మల్కాగిజిరి జిల్లా ఘట్ కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ద్వారకానగర్‌లో చోటుచేసుకుంది.
ఘట్ కేసర్ : కుటుంబ కలహాలు, భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ మల్కాగిజిరి జిల్లా ఘట్ కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ద్వారకానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కిలగనూర్ మండలం సలకలపూర్కు చెందిన మాధవి (37)కి 18 ఏళ్ల క్రితం కాట్రావత్ రాజు (44)తో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కాగా, గత 15 ఏళ్లుగా ఘట్ కేసర్లో నివాసముంటున్నారు.
గత మూడేళ్లుగా రాజు మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ తరచూ వేధించేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో భార్య ఛాతీపై సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు 108లో దవాఖానకు తరలించగా, చికిత్సకు ముందే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు రాజుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- brick
- Crime news
- ghatkesar
- Husband
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

