మేడ్చల్, జూలై 5: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగానే భారీ వేతన ప్యాకేజీతో ప్రఖ్యాత ఐటీ సంస్థ అమెజాన్లో ఉద్యోగం సొంతం చేసుకున్నారు.
కళాశాలలో సీఎస్ఈ చివరి సంవత్సరం చదువుతున్న శృతి, శ్రీశ్రావ్య రూ.46 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్లుగా నియామకమయ్యారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు అత్యున్నత వార్షిక వేతనంతో ప్రఖ్యాత సంస్థకు ఎంపిక కావడంపై కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత హర్షం వ్యక్తం చేశారు.