సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తమ వినియోగదారులకు సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలను త్వరితగతిన అందించేందుకు 33 కేవీ కొత్త హెచ్టీ సర్వీసు దరఖాస్తుల కోసం ఆటో ఎస్టిమేట్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిందని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఈ విధానంలో ముందుగా నూతన హెచ్టీ సర్వీసుకు దరఖాస్తు చేసిన తరువాత హై టెన్షన్ కన్స్యూమర్ సర్వీస్ కనెక్షన్ సిస్టం జీఐఎస్ కో ఆర్డినేట్లను సేకరించి ఆ వివరాలను సాసా యాప్ ద్వారా నేరుగా సంస్థ ప్రధాన కార్యాలయంలోని చీఫ్ ఇంజినీర్ కమర్షియల్కు పంపుతుందన్నారు.
ఈ సమాచారం కార్పొరేట్ ఆఫీస్కు అందగానే యాప్ ద్వారా నేరుగా ఎస్టిమేట్ రూపొందిస్తారని, ఎస్టిమేట్ ఆమోదం తర్వాత డిమాండ్ నోటీసు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందని తెలిపారు. ఆ వివరాలు వినియోగదారుడికి ఎస్ఎంఎస్, ఈ మెయిల్ ద్వారా పంపిస్తామని, ఆటో ఎస్టిమేట్ ఆమోదం అయిన విషయాన్ని సంబంధిత ఏడీఈ , డీఈ, ఎస్ఈ ఆపరేషన్ సిబ్బందికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారన్నారు.