ఎర్రగడ్డ, మార్చి 5: అనుకున్నంత పని జరిగింది. ఆర్టీసీ ప్రయాణికులకు సేద తీర్చాల్సిన బోరబండ బస్ టెర్మినల్‌లోని బస్‌షెల్టర్ రాత్రికి రాత్రి హోటల్‌గా మారింది. డివిజన్ కు చెందిన కొందరు ఘనులు రెండు రోజుల కిందట తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
షెల్టర్‌కు షెట్టర్‌ను అమర్చి మంగళవారం రాత్రి ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. రూ.5 లక్షలు అడ్వాన్స్.. నెలకు రూ.25 వేలు కిరాయిగా ఒప్పందం కుదిరింది. షెల్టర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తి అందులో హోటల్ వ్యాపారం మొదలు పెట్టాడు. కండ్ల ముందు ఇంత జరిగినా.. అటు ఆర్టీసీగానీ.. ఇటు బల్దియా వాళ్లు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.