Hyderabad | కాచిగూడ, మే 24 : గోల్నాక ప్రాంతానికి చెందిన జీహెచ్ఎంసీలోని హార్టికల్చర్ విభాగంలో అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్ కుమార్(56) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విజయ్ కుమార్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విజయకుమార్ ఆకస్మిక మరణంతో భార్య, కూతుర్లు గుండెలవిసేలా రోదించారు.
విజయ్ మృతదేహానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నివాళులర్పించారు. విజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. హర్రస్ పెంటలోని హిందూ స్మశాన వాటికలో విజయ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.