Holi Festival | హైదరాబాద్ : హైదరాబాద్లోని ఇందిరా పార్కు( Indira Park )లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani Srinivas Yadav ), డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి తలసాని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మన సంస్కృతి, సాంప్రదాయాలను పండుగలు చాటి చెబుతాయని తలసాని పేర్కొన్నారు. భారతదేశంలో మనం జరుపుకునే పండుగలు ఎంతో గొప్పవి. ప్రతి పండుగకు ఒక ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.