HMDA | మెహదీపట్నం, మే 31 : చారిత్రాత్మక గోల్కొండ కోట, కటోరా హౌస్, సెవెన్ టూంబ్స్ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడానికి హెచ్ఎండీఏ నుంచి 75 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు శనివారం హెచ్ఎండీఏ అధికారులతో కార్వాన్ ఎమ్మెల్యే మహమ్మద్ కౌసర్ మొయినుద్దీన్, నానల్ నగర్ కార్పొరేటర్ ఎండి నసీరుద్దీన్ తదితరులు సమావేశమయ్యారు.
కటోరా హౌస్ సుందరీకరణ ఫౌంటైన్ల నిర్మాణం, గోల్కొండ సెవెన్ టుమ్స్ రోప్ వే, గోల్కొండ లో నైట్ బజార్ నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. దీనికోసం అభివృద్ధి పనులను ఎలా చేపట్టాలనే విషయంపై చర్చించారు.