Hyderabad | వరంగల్, నాందేడ్ హైవేలపై హెచ్ఎండీఏ పూలబాటలు.. ఇతర హైవేలపైనా ఫోకస్
Hyderabad | హైదరాబాద్ మహానగరం నుంచి నలువైపులా ఉన్న జాతీయ రహదారులు పూల బాటలుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం, ఫ్లైఓవర్‌బ్రిడ్జిలు, మెట్రో కారిడార్లు, ఏకో పారుల ఏర్పాట్లలో ప్రధాన భూమిక పోషిస్తున్నది.
సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరం నుంచి నలువైపులా ఉన్న జాతీయ రహదారులు పూల బాటలుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం, ఫ్లైఓవర్‌బ్రిడ్జిలు, మెట్రో కారిడార్లు, ఏకో పారుల ఏర్పాట్లలో ప్రధాన భూమిక పోషిస్తున్నది. రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (ఎన్‌హెచ్-165) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (ఎన్‌హెచ్-161) వెంట 33 కిలోమీటర్లు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులను హెచ్ఎండీఏ పూర్తి చేసింది. శ్రీశైలం హైవే (ఎన్‌హెచ్-765) వెంట 18 కిలోమీటర్లు, కరూలు హైవే (ఎన్‌హెచ్-44) వెంట 25 కిలోమీటర్లు, రాజీవ్ రహదారి స్టేట్ హైవే (ఎస్‌హెచ్-1) వెంట 39 కిలోమీటర్లు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ నిర్వహణ చేపట్టారు.

హెచ్ఎండీఏ నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు
ముఖ్యంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో వరంగల్ నేషనల్ హైవే (163)వెంట గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ హైవే వెంట గ్రీనరీ పెంపుదల బాధ్యతలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రికి సూచించారు. తొలి దశలో వరంగల్ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను రూ.5.5 కోట్ల అంచనాలతో దాదాపు 30 కిలోమీటర్ల పొడవున ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో పూర్తి అయ్యాయి. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ‘మల్టీలేయర్ ప్లాంటేషన్’ వరంగల్ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి కావడంతో వరంగల్ రహదారి వెంట అకు పచ్చని అందాలు అందరికీ కనువిందు చేస్తున్నాయి.

పచ్చదనంపై అధ్యయనం..
హెచ్ఎండీఏ చేపట్టిన పచ్చదనంపై గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) అధ్యయనం చేసింది. ఇటీవల కేరళ రాష్ట్రానికి చెందిన అఖిల భారత సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారులు డిప్యూటీ కన్జర్వేటర్ హెడ్ క్వార్టర్స్ మహమ్మద్ షబాబ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సోషల్ ఫారెస్ట్రీ – కోజికోడ్) కీర్తి వరంగల్ నేషనల్ హైవే గ్రీనరీని అధ్యయనం చేశారు. అంతేకాకుండా బెర్లిన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి చార్లెట్ ఎడాలిన హ్యూమన్ జియోగ్రఫీ అనే అంశంపై పీహెచ్‌డీలో భాగంగా హెచ్ఎండీఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్‌పై పరిశోధన చేశారు.







Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

