సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ చేపట్టను న్న రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు పరిహార చెల్లింపు నగదు రూ పంలోనే జరగనుంది. నార్త్ సిటీ మీ దుగా రెండు ఎలివేటెడ్ కారిడార్లను దాదాపు రూ.12 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు హెచ్ఎండీ ఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇం దులో జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలోని డెయిరీ ఫాం రోడ్డు వర కు మొత్తంగా 23 కిలోమీటర్ల పొడువైన ఎలివేటెడ్ కారిడార్ రానుంది. ఇందులో ఒక వైపు డబుల్ డెక్కర్ రా నుండగా, మరోవైపు అతి తక్కువ పొ డవైన టన్నెల్ రోడ్డును హెచ్ఎండీఏ నిర్మించనుంది. అయితే, ప్రాజెక్టు కో సం ఓవైపు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది.
మరోవైపు పరిహారం, రోడ్డు వెడల్పు అంశంపై స్థానికులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, ఈ ప్రాజెక్టు కోసం అవసరమై న భూముల సేకరణకు అటు మేడ్చ ల్, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి హెచ్ఎండీఏ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ క్రమం లో ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నవారికి పరిహారం నగదు రూపంలోనే చెల్లించాలనే ప్రతిపాదనకు ఖ రారైనట్లుగా తెలిసింది. గతంలో టీడీఆర్ రూపంలో పరిహారం చెల్లించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైనా, క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే విధంగా ప్రాజెక్టు వెడల్పుపై తీ వ్ర అసహనం వ్యక్తం అవుతూనే ఉం ది. అయితే, పరిహారం ఇప్పటికీ కొం తమంది కోల్పోతున్న భూమికి స మానంగా అభివృద్ధి చెందిన లే అవుట్లలో ఓపెన్ ప్లాట్లు ఇవ్వాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పరిహారాన్ని నగదు రూపంలో చెల్లించాలనే ప్రతిపాదనకు అంగీకా రం తెలిపిన నేపథ్యంలో రూ.150 కోట్లు మేర ప్రాథమిక దశలో పరిహా రంమిచ్చే అవకాశం ఉంది.
నగదు రూపంలో చెల్లింపులు
నార్త్ సిటీకి రవాణా సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఎలివేటెడ్ కారిడార్‌కు పరిహారాన్ని నగదు రూపంలోనే చెల్లించనున్నారు. రెం డు మార్గాల్లో 23 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టు కో సం రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని హెచ్ఎండీఏ అంచనా వేసింది. రోడ్డుకు ఇరువైపులా 200 ఫీట్ల మేర ఆస్తులను సేకరించేందుకు ఇప్పటికే గుర్తించిన ప్రాంతంలోని ఆస్తి యజమానులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. దీని కోసం ఓవైపు అభిప్రా యం కోరుతూనే మరోవైపు గ్రామ స భల ద్వారా భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణను ఆయా జిల్లాల యంత్రాంగం చేపడుతోంది. దీనిలో మేడ్చల్ జిల్లాలో 380 ఆస్తులకు, హై దరాబాద్ జిల్లాలో 350-400 ఆస్తులకు పరిహారాన్ని టీడీఆర్‌కు బదులు నగదులోనే చెల్లించే అవకాశం ఉంది.
ఆగని డిమాండ్లు…
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుల వి షయంలో ఇప్పటికీ స్థానికుల నుంచి పలు డిమాండ్లు వ్యక్తమవుతూనే ఉ న్నాయి. భూములు కోల్పోతున్న వా రికి పరిహారం ఇప్పటికీ కొంత మంది కోల్పోతున్న భూమికి సమానంగా డెవలప్ చేసిన ప్లాట్లను పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.