జంట జలాశయాలకు పోటెత్తిన వరద
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తతున్నది. 8 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రెండు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.
- ఉస్మాన్‌సాగర్ 12, హిమాయత్‌సాగర్ 9 గేట్లు ఎత్తి నీటి విడుదల
సిటీ బ్యూరో/ మణికొండ/బండ్లగూడ, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తతున్నది. 8 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రెండు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో శుక్రవారం ఉస్మాన్ సాగర్ 12 గేట్లు 9 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా హిమాయత్‌సాగర్ 9 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1789.20 అడుగులకు చేరింది.
ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 8వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. దీంతో ఔట్ ఫ్లో 10668 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.95 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో దిగువకు 14,446 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు దశాబ్దాల తర్వాత ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్సాగర్లకు ఇంతస్థాయిలో వర్షపాతం నమోదైనట్లుగా జలమండలిశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మూసీకి వరద ప్రవాహం భారీగా పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

