చిక్కడపల్లి, జనవరి 23: ప్రఖ్యాతి గాంచిన హెబ్రోన్ చర్చిలో గురువారం సాయంత్రం మారోసారి ఉద్రిక్తత నెలకొన్నది. హెబ్రోన్ చర్చి సొసైటీ అధికార ప్రతినిధి రాగి పీటరాచారి తన అనుచర వర్గంతో చర్చి లోపలికి రావడంతో ఉద్రిక్తత నెలకొన్నది. రాగి పీటరాచారి వర్గం చర్చిలో ఉన్న వారిని బయటకు పంపించి చర్చి ప్రధాన గేటుకు తాళం వేసి లోపలనే ఉన్నారు. చర్చికి సంబంధించిన మారో గ్రూపు చర్చి బయట పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్నది. కొద్ది కాలంగా సద్దుమణిగిన ఆధిపత్య పోరు మరోసారి నెలకొన్నది. ఏసీపీ రమేశ్, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని గుంపులుగా ఉన్నవారిని చెదరగొట్టారు. ఇరు గ్రూపుల మధ్య గొడవలు కాకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ రమేశ్‌కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ పీటార చారిని గేటు తీయాలని కోరినా తీయబోనని మొండికేశాడు. న్యాయస్థానం తమకు అనుకూలంగా ఉందని చర్చి నిర్వహణ తమకు చెల్లుతుందన్నారు.
చిక్కడపల్లి పీఎస్ లో చర్చలు..
దాదాపు 5 గంటల అనంతరం పీటారచారితో పాటు మరో గ్రూప్ సభ్యులు చర్చలకు అంగీకరించారు. చిక్కడపల్లి పీఎస్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ సమక్షంలో చర్చలు జరిగుతున్నాయి. ఎమ్మెల్సీ మల్లన్న, తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన చైర్మన దీపక్ జాన్ తదితరలు చర్చలో పాల్గొన్నారు.