హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి జల్లులు కురిశాయి. గత నాలుగురోజు నుంచి వరుసగా కురుస్తున్న వానలతో నగరం తడిసిముైద్దెంది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి.