Rains | హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 74.8 మి.మీ వర్షపాతం నమోదు
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి వాన దంచికొట్టింది. మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది.
Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి వాన దంచికొట్టింది. మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. వానకు తోడుగా బలమైన ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
సికింద్రాబాద్‌లో అత్యధికంగా 74.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ముషీరాబాద్‌లో 73 మి.మీ., రామచంద్రాపురంలో 68.5 మి.మీ., కూకట్‌పల్లిలో 64.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల్లో వర్షపాతం పరిశీలిస్తే.. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 93.5 మి.మీ., నాగర్‌కర్నూల్ జిల్లాలో 87 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఆగస్టు 17వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress | పీసీసీ చీఫ్ కౌన్?.. మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
Irrigation Projects | కేసీఆర్ ఎత్తిపోతలు.. కాంగ్రెస్ ఉత్త కోతలు
Jai Jawan | సైనికుల త్యాగాలకు దర్పణం జై జవాన్.. ట్రైలర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

