Jai Jawan | సంతోష్ కల్వచర్ల, పావని జంటగా నటిస్తున్న చిత్రం ‘జై జవాన్’. నాగబాబు పోటు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దర్శకుడు మలినేని గోపీచంద్ విడుదల చేశారు.
దేశభక్తి నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో సైనికులు చేస్తున్న త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపించామని దర్శకుడు తెలిపారు. ట్రైలర్లో ఉన్న ‘జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని, జీవితాన్నిచ్చిన మాతృభూమి రుణాన్ని తీర్చుకునేది ఒక జవాన్ మాత్రమే’ అనే సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: బాబు కొలబతుల, రచన-దర్శకత్వం: నాగబాబు పోటు.