Irrigation Projects | కేసీఆర్ ఎత్తిపోతలు.. కాంగ్రెస్ ఉత్త కోతలు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అనగానే కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏండ్ల తరబడి సాగిన వీటి నిర్మాణంపై దృష్టి సారించిన ఆయన 10 ఏండ్లలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించారు. కచ్చితమైన ప్రణాళిక, వనరుల సమీకరణ, అధికారుల నియామకం, సత్వర నిర్ణయాల ఫలితంగానే పదేళ్ల కాలంలో అనేక అద్భుతాలను చేసి చూపారు.
- నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం..
- సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం ప్రజల కల సాకారం
- 8 ఏండ్లుగా 7,400 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..
- 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన కాంగ్రెస్ సర్కార్
- అయినా అంతా తామే కట్టినట్టు ముఖ్యమంత్రి, మంత్రుల బిల్డప్..
- ప్రాజెక్టు మూడు పంప్‌హౌస్‌లు ప్రారంభం
Irrigation Projects | రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అనగానే కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏండ్ల తరబడి సాగిన వీటి నిర్మాణంపై దృష్టి సారించిన ఆయన 10 ఏండ్లలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించారు. కచ్చితమైన ప్రణాళిక, వనరుల సమీకరణ, అధికారుల నియామకం, సత్వర నిర్ణయాల ఫలితంగానే పదేళ్ల కాలంలో అనేక అద్భుతాలను చేసి చూపారు. భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలనైతే కేవలం 10 నెలల కాలంలోనే సాకారం చేశారు. స్వరాష్ట్రంలో చేపట్టిన కీలక ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తిచేయడం కేసీఆర్ లక్ష్యసాధనకు నిదర్శనం. వాటిలో మచ్చుకు కొన్నింటి వివరాలు సంక్షిప్తంగా..
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించేందుకు వీలుగా రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకానికి టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద 2016 ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేస్తున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. 8 ఏండ్లలో 7,400 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు పూర్తిచేసింది.

సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. భద్రాద్రి జిల్లా పూసుగూడెం వద్ద నిర్మించిన పంపుహౌస్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. బీజీ కొత్తూరు పంపుహౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి, కమలాపురం పంపుహౌస్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. 8 నెలలు గడిచిపోయాయి. ఒక్క పంప్నూ బిగించలేదు. ఒక్క మోటరైనా కొత్తగ పెట్టలేదు. పైగా సీతారామ ప్రాజెక్టే వృథా అన్నారు. ఖర్చు భారమని, అంచనాలు పెరిగిపోయాయని చెప్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఆ ప్రాజెక్టు తామే కట్టామని, క్రెడిట్ అంతా తమదేనని అంటున్నారు. కానీ ఖమ్మం ప్రజలకు తెలుసు. ప్రాజెక్టు ఎవరి ఆలోచనో! ఎవరి ప్రయత్నమో! ఎవరి కష్టమో! కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి కూడా తియ్యకుండా ఆగిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించి పరుగులు తీయించింది కేసీఆర్.

ఒకటికాదు రెండుకాదు.. పదుల సంఖ్యలో ఎత్తిపోతల పథకాలను వేగంగా పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌దే. ప్రభుత్వం మారిన తర్వాత కూడా.. సీతారామ ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యిందని, తుదిమెరుగులు దిద్దితే రైతులకు నీళ్లందించవచ్చని ప్రభుత్వానికి కేసీఆర్ గుర్తుచేశారు. ఆయన చెప్పిన తర్వాత కదలిన ప్రభుత్వం.. గురువారం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను ప్రారంభించింది.
- ఎత్తిపోతల పేరు: కోయిల్‌సాగర్ జిల్లా: ఉమ్మడి మహబూబ్‌నగర్
వినియోగంలోకి తెచ్చింది : బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రారంభం:2000.. పూర్తయింది: 2017
పనులు సాగింది: 17 ఏండ్లు
సాగులోకి తెచ్చిన ఆయకట్టు : 8 వేల ఎకరాలు
- ఎత్తిపోతల పేరు: రాజీవ్ భీమా జిల్లా:ఉమ్మడి మహబూబ్‌నగర్
వినియోగంలోకి తెచ్చింది : బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రారంభం:1983.. పూర్తయింది: 2016
పనులు సాగింది: 33 ఏండ్లు
సాగులోకి తెచ్చిన ఆయకట్టు : 1,58,000 ఎకరాలు
- ఎత్తిపోతల పేరు: మిడ్‌మానేరు జిల్లా: ఉమ్మడి కరీంనగర్
వినియోగంలోకి తెచ్చింది : బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రారంభం:2005.. పూర్తయింది: 2018
పనులు సాగింది: 13 ఏండ్లు
సాగులోకి తెచ్చిన ఆయకట్టు: 1,00,000 ఎకరాలు
- ఎత్తిపోతల పేరు: నెట్టెంపాడు జిల్లా: ఉమ్మడి మహబూబ్‌నగర్
వినియోగంలోకి తెచ్చింది : బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రారంభం:1991.. పూర్తయింది : 2016
పనులు సాగింది: 25 ఏండ్లు
సాగులోకి తెచ్చిన ఆయకట్టు : 1,42,000 ఎకరాలు
- ఎత్తిపోతల పేరు: చనకాకొరాట జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్
వినియోగంలోకి తెచ్చింది : బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రారంభం:1975.. పూర్తయింది : 2023
పనులు సాగింది : 48 ఏండ్లు
సాగులోకి తెచ్చిన ఆయకట్టు : 40,000 ఎకరాలు
- ఎత్తిపోతల పేరు: పాలమూరు రంగారెడ్డి జిల్లా : ఉమ్మడి మహబూబ్‌నగర్
వినియోగంలోకి తెచ్చింది : బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రారంభం : 2015.. పూర్తయింది : 2023
పనులు సాగింది : 8 ఏండ్లు
సాగులోకి తెచ్చిన ఆయకట్టు : డిస్ట్రిబ్యూటరీలు తవ్వాలి
- ఎత్తిపోతల పేరు: కల్వకుర్తి జిల్లా : ఉమ్మడి మహబూబ్‌నగర్
వినియోగంలోకి తెచ్చింది : బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రారంభం : 1984.. పూర్తయింది : 2016
పనులు సాగింది : 32 ఏండ్లు
సాగులోకి తెచ్చిన ఆయకట్టు : 3,07,000 ఎకరాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

