హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. పలు బస్తీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చార్మినార్, యాకుత్పురా, ఉప్పుగూడ, బహదూర్పురా, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, బార్కస్, ఆరాంఘర్, మెహిదీపట్నం, గండీపేట్, టోలీచౌకి, సరూర్నగర్, మలక్పేట, ఎల్బీనగర్తో పాటు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఈ ఏరియాల్లో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.
VERY HEAVY RAIN AT #FALAKNUMA @balaji25_t @Rajani_Weather @HiiHyderabad @HiHyderabad @MDShoai46159754 #HyderabadRains Stay Safe #Hyderabadiss… pic.twitter.com/315eQp2Z7g
— Ahmed SAM (@AhmedSAM7272) August 19, 2022