హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో సోమవారం రాత్రి వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, బోడుప్పల్, తార్నాక, లాలాపేట, పీర్జాదిగూడ, నాగోల్, మనన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయాంజల్ వాన పడింది. పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, చైతన్యపురి, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, అంబర్‌పేట, కొత్తపేట, కర్మన్‌ఘాట్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట్ల, విద్యానగర్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వానకు పలు చోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప నగరవాసులు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.