Hyd Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. పొద్దంతా భానుడు ప్రతాపం చూపించగా.. సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్, సిక్రిందాబాద్ పరిధిలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతున్నది. అత్తాపూర్, రాజేంద్రనగర్, గొల్కోండ, ఖాజాగూడ, మనికొండ, షైక్‌పేట, కూకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్నది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, బేగంపేట, సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, లక్డీకపూరల్, హిమాయత్‌నగర్‌తో పాటు నగరవ్యాప్తంగా పలుచోట్ల జోరువర్షం కురుస్తున్నది. అలాగే, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్, కొంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, కృష్ణాపూర్, గౌడవల్లితో పడుతున్నది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు తడిపోయారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
Heavy Rain Started In Kukatpally, KPHB , Hyder Nagar & Moosapet Area.. @Hyderabadrains pic.twitter.com/91WSgo1vjD
— RSB NEWS 9 (@ShabazBaba) October 1, 2024