Hyderabad Rains | హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, మల్కాజ్గిరి, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, నిజాంపేట, బాచిపల్లిలో వర్షం పడింది. అల్వాల్, శామీర్‌పేట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, ఒక్కసారిగా కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఇదిలా ఉండగా.. రాబోయే మూడుగంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.